సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (13:32 IST)

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కలకలం.. భక్తులు అలెర్ట్

leopard
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. అలిపిరి నడకదారిలోని నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నడకదారిలో భక్తులను గుంపులుగా పంపిస్తారు. 
 
మరోవైపు చిరుతపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం రికార్డయిందని.. భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. 
 
అలిపిరి నడకదారిలో చిరుతల సంచారం కలవరపెడుతోంది. గతంలో నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఓ బాలుడిపై దాడి చేసి గాయపర్చిన చిరుత బాలికను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎముకలు అమర్చి ఐదు చిరుతలను పట్టుకున్నారు.
 
చిరుతల సమస్య తీరిపోయిందని భావించారు. అయితే తాజాగా మరో చిరుత సంచారం కలకలం రేపింది. భక్తుల రక్షణ కోసం టీటీడీ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి 10 గంటల తర్వాత నడకదారిపైకి ఎవరినీ అనుమతించరు.
 
ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే. పైగా, 12 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాక్‌వేపైకి అనుమతించరు. చిరుతల నుంచి భక్తులను రక్షించేందుకు టీటీడీ కర్రలు పంపిణీ చేస్తోంది. భక్తులు కూడా గుంపులుగా నడవాలని.. గార్డులను కూడా నియమించారు.