శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (21:03 IST)

17 నుండి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

ద‌స‌రా ఉత్స‌వాల నేప‌ధ్యంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు.

విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్ నూజివీడు-మైలవరం- జీ కొండూరు - ఇబ్రహీంపట్నం మీదుగా మల్లింపు. విశాఖపట్నం-చెన్నై మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్-అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల మీదుగా మల్లింపు.

గుంటూరు -విశాఖపట్నం మధ్య వాహనాలు బుడంపాడు  నుండి పొన్నూరు-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్ జంక్షన్ మీదుగా మల్లింపు. విజయవాడ - హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సులు రాకపోకలను పండిట్ నెహ్రూ బస్టాండ్-చల్లపల్లి బంగ్లా-బుడమేరు వంతెన - పైపుల రోడ్-సితార- గొల్లపూడి వై జంక్షన్ ఇబ్రహీంపట్నం మీదుగా మల్లింపు.

విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్య సిటీ బస్సులను  ప్రకాశం స్టాట్యూ -లో బ్రిడ్జ్-గద్ద బొమ్మ కె.ఆర్.మార్కెట్-పంజా సెంటర్-నెప్రో చౌక్-చిట్టినగర్-టన్నెల్-సితార-గొల్లపూడి-ఇబ్రహీంపట్నం మీదుగా మల్లింపు.

ఇబ్రహీంపట్నం నుండి గొల్లపూడి-సితార-సి.వి. ఆర్ పై ఓవర్-చిట్టినగర్-నెహ్రూ చాక్-పంజా సెంటర్ కే.ఆర్ మార్కెట్ లో బ్రిడ్జి-ప్రకాశం స్టాట్యూ -ఏ.సి.ఆర్-సిటీ బస్ స్టాప్ కు అనుమతి.

మూల నక్షత్రం రోజు 20 వతేది రాత్రి నుంచి  ఉదయం వరకు ప్రకాశం బ్యారేజ్ మీదకు వాహనాలకు అనుమతి లేదు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశాలు
 
ద్విచక్ర వాహన దారుల కొరకు పార్కింగ్ ప్రదేశాలు :
1) పద్మావతి ఘాట్, 2) ఇరిగేషన్ పర్కింగ్, 3) గద్ద బొమ్మ, 4) లోటస్ అపార్ట్ మెంట్, 5) ఆర్.టి.సి. వర్క్ షాప్ రోడ్ 

కార్ల కొరకు పార్కింగ్ ప్రదేశాలు:
(1) సీతమ్మవారి పాటలు, 2) గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, 3) టి.టి.డి పార్కింగ్. 

బస్సుల కొరకు పార్కింగ్ ప్రదేశం:
(1) పున్నమి ఘాట్ వద్ద గల పార్కింగ్ ప్రదేశం.

భక్తులు వచ్చు టూరిస్ట్ బస్సులు మార్గం:
హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు భవానీపురం లారీ స్టాండ్ వద్ద సర్వీస్ రోడ్ నుండి పున్నమి హోటల్ వద్ద కుడి  వైపు తిరిగి పున్నమి ఘాట్ వద్ద పార్క్ చేయాలి. విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు రామవరప్పాడు రింగ్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్ పైపుల రోడ్-వై.వి.రావు ఎస్టేట్-సి.వి.ఆర్. పై ఓవర్-సితార జంక్షన్-ఆర్ టి.సి. వర్క్ షాప్ రోడ్-పున్నమి హోటల్ మీదుగా వచ్చి పున్నమి ఘాట్లో పార్క్ చేయాలి.

గుంటూరు వైపు నుంచి వచ్చే భక్తులు వారధి-కృష్ణలంక ప్లై ఓవర్-ఆర్.టి.సి. ఇన్ గేట్-దుర్గా పై ఓవర్-స్వాతి జంక్షన్-వేంకటేశ్వర ఫౌండ్రీ వద్ద యూ టర్న్ తీసుకొని పున్నమి హోటల్ వరకు వచ్చి అక్కడ కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్‌లో పార్క్ చేయాలి. భక్తులు తిరిగి వెళ్ళు సమయమున పున్నమి ఘాట్ వద్దనే వారి బస్సు ఎక్కాలి. వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లాలి.