ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కు పరిచయం చేశారు. ట్రంప్ దంపతులతో కేసీఆర్ కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ట్రంప్ సీఎం కేసీఆర్ తో ముచ్చటించారు. రాష్ట్రపతి దంపతులు ఇచ్చిన ఈ విందు కార్యక్రమంలో ప్రధాని...