1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (22:53 IST)

రూ.3.20 కోట్ల రూ.2వేల రూపాయల నోట్లు: టీటీడీకి ఆర్బీఐ వెసులుబాటు

Hundi
దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణిని కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి ఆపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 7న బ్యాంకులో మార్పిడికి గడువు ముగిసింది.

అయితే గడువు ముగిసినా భక్తులు.. తిరుమల శ్రీవారి హుండీలో వీటిని వేయడంతో టీటీడీ దగ్గర రూ.3 కోట్లకుపైగా పోగయ్యాయి. వీటిని మార్చుకోడానికి అవకాశం కల్పించాలని టీటీడీ కోరింది. 
 
రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి మరో అవకాశం కల్పించినట్లు తెలిసింది. తద్వారా టీటీడీ ప్రయత్నం ఫలించింది. ఆ నోట్లను మార్చుకోడానికి వెసులుబాటు కల్పించింది.