శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:27 IST)

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ

tirumala
తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి తితిదే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను వేగవంతం చేసినట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
అలాగే, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ డిసెంబరు నుంచి మార్పులు చేస్తామని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
 
సర్వదర్శనం టోకెన్ల జారీపై తితిదే ఈవో ధర్మారెడ్డి వివరాలను వెల్లడించారు. తిరుతిలో శ్రీనివాస్, గోవిందరాజు, భూదేవి సత్రాల్లో నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ టోకెన్ల జారీ ఉంటుందని ఆయన తెలిపారు. రోజువారీ కోటా చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. 
 
సోమ, బుధ, గురు, ఆదివారాల్లో 20 వేల నుంచి 25 వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు చొప్పున అందజేస్తామన్నారు.