భారతీయ జనతా పార్టీనా? భారతీయ గూడాచారి పార్టీ నా?: తులసి రెడ్డి
"మోడీ గారు....ప్రధాని హోదాలో ఇది ఏం పని? దొంగచాటుగా తొంగిచూడటం భావ్యమా?" అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు డా ఎన్.తులసి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
ఉగ్రవాద కార్యకలాపాలను పసిగట్టి చర్య తీసుకునేందుకు ఉపయోగించాల్సిన నిఘా వ్యవస్థలను రాహుల్ గాంధీ, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాలపై ప్రయోగించటం భావ్యమా అని తులసిరెడ్డి ప్రధాని మోడీ, హోమ్ మంత్రివర్యులు అమిత్ షా లపై మండిపడ్డారు.
ఈ చర్య దేశ ప్రజల వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ, గౌరవాలు విఘాతం కలిగించటమేనని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై న్యాయ విచారణ జరిపించాలని లేదా సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి కాస్తా బీజీపీ ( భారతీయ గూడాచారి పార్టీ) గా మారిపోయిందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.