శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Ganesh
Last Updated : బుధవారం, 2 జులై 2014 (18:08 IST)

టీవీ నటికి వేధింపులు: సహచర నటుడిపై ఫిర్యాదు!

పలు టీవీ సిరియళ్లలోనూ, తెలుగు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోన్న వర్థమాన నటిపై సహచర నటుడు అల్లా భక్ష్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే....

వేంకటగిరిలో నివాసముంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలు చిత్రాల్లోను, టీవీ సీరియళ్లలో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమెతో నటిస్తోన్న సహచర నటుడు అల్లా భక్ష్ ఆమెని గతకొంత కాలంగా ఫాలో అవుతూ వేధిస్తున్నాడు. తాజాగా మంగళవారం ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు నటుడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అల్లా భక్ష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.