గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated : గురువారం, 29 జులై 2021 (20:48 IST)

తాడేప‌ల్లిలో తాళం వేసిన ఇంట్లో... జంట మృత‌దేహాలు!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేప‌ల్లి ప్రాంతంలో ఒక‌ జంట మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి లో ఓ నివాసం లో గుర్తు తెలియని రెండు మృతదహాలు క‌నిపించాయి. ఈ జంట మృతి చెంది వారం రోజులు అయివుండొచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
చుట్టుప‌క్క‌ల వారికి దుర్వాస‌న రావటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తాళాలు వేసి ఉండటంతో తాళాలు పగలకొట్టి ఆ ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించ‌గా, ఈ జంట మృత‌దేహాలు క‌నిపించాయి. 
 
వీరిద్ద‌రూ భార్య భ‌ర్త‌లు అయి ఉండ‌వొచ్చ‌ని, ఇంటికి తాళాలు వేసుకొని ఆత్మహత్యకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివ‌రాల కోసం పోలీసుల దర్యాప్తు చేపట్టారు.