పరుగు పందెంలోనే కాదు.. పిల్లలు పుట్టించడంలోనూ దూకుడే. బోల్ట్‌కు కవలలు
పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ మరోమారు తండ్రి అయ్యాడు. అదీకూడా ఇద్దరు పిల్లలు. బోల్ట్ భార్య తాజాగా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. తనకు ఇద్దరు మగపిల్లలు పుట్టినట్లు బోల్ట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
ఫాదర్స్ డే సందర్భంగా తన ట్విట్టర్‌లో అతను ఈ విషయాన్ని చెప్పాడు. ఆ ఇద్దరు కుమారులకు థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టారు. అయితే ఆ పిల్లలు ఎప్పుడు పుట్టారన్న విషయాన్ని మాత్రం ఉసేన్ చెప్పలేదు. బోల్ట్ భార్య బెన్నెట్ కూడా కవలల ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
ఆ ఫోటోలో వారి కూతురు ఒలింపియా లైటనింగ్ బోల్ట్ కూడా ఉంది. 2020 మేలో ఒలింపియా బోల్ట్ పుట్టింది. కానీ రెండు నెలల తర్వాత ఆమెకు పేరు పెట్టారు. ఫ్యామిలీ ఫోటోను తాజాగా పోస్టు చేయడంతో బోల్ట్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు.
34 ఏళ్ల బోల్ట్ ఒలింపిక్స్ క్రీడల్లో 8 స్వర్ణాలను సాధించాడు. 2008, 2012, 2016 క్రీడల్లో గోల్డ్ మెడల్స్ గెలిచాడు. 2017లో రిటైర్ అయిన స్టార్ అథ్లెట్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. ఫాస్టెస్ట్ మ్యాన్‌గా చరిత్రలో స్థానం సంపాదించిన బోల్ట్.. 100, 200 మీటర్ల ఈవెంట్‌లో వరుసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.