శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (22:47 IST)

ఇద్దరి ప్రాణాలు తీసిన ఈత సరదా.. క్వారీలో పడి ఇద్దరు అమ్మాయిలు గల్లంతు

క్వారీలో పడి ఇద్దరు అమ్మాయిలు గల్లంతైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు చౌడేపల్లి మండలం దిగువ పల్లి పంచాయతీ  పెద్దూరు గ్రామానికి చెందిన నజీర్ సాహెబ్ కుమార్తె  చస్మా (20) కుటుంబ సభ్యులతో గడిలో ఉన్న బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో సహా వచ్ఛారు.

నజీర్ సాహెబ్ తమ కుటుంబ సభ్యులతో పాటు గడికి చెందిన ఇస్మాయిల్ కుమార్తె అఫ్రీన్ను తీసుకొని గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో లక్ష్మీ స్టోన్ క్రషర్ క్వారీ వద్ద కు వెళ్లారు. అక్కడ నీరు ఎక్కువగా ఉండటంతో  కుటుంబ సభ్యులతో ఈత కొట్టడానికి నీటిలోకి దిగారు.

అయితే లోతు ఎక్కువగా ఉన్న కారణంగా నజీర్ సాహెబ్ భార్యతో పాటు కూతురు చస్మా ఆఫ్రీద్ లు  ప్రమాదవశాత్తు   నీటిలో మునిగి పోతుండటంతో గమనించిన ఆయన భార్యను రక్షించుకునే లోపే చస్మా, ఆఫ్రీన్ లు నీటిలో మునిగి గల్లంతయ్యారు.

చూస్తుండగానే ఇద్దరు నీటిలో మునిగిపోవడంతో ఆయన నిర్ఘాంతమైపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానికుల సహాయంతో వెలిక తీసే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే సాయంత్రం అయిపోవడంతో వెలుతురు సరిగా లేని దాని వలన వారి మృతదేహాలు కనపడుటలేదని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న గడి గ్రామస్తులు తో పాటు పెద్దూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.