శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (11:18 IST)

జేపీతో మాట్లాడాక చెపుతా... : ఉండవల్లి అరుణ్ కుమార్

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సమావేశం కానున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని భావ

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సమావేశం కానున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఇప్పటికే జేపీతో పవన్ చర్చలు జరుపగా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం పవన్‌తో భేటీ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఇక పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్‌తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయించారు. పవన్‌తో భేటీ అనంతరం జయప్రకాశ్ మాట్లాడుతూ.... పవన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తర్వాతనే జేఏసీలో చేరాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.