ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:58 IST)

26, 27 తేదీల్లో చిత్తూరుజిల్లాకు యునిసెఫ్‌ బృందం పర్యటన

యునిసెఫ్‌ బృందం ఈ నెల 26, 27 తేదీల్లో చిత్తూరుజిల్లాలో పర్యటించనుంది. 26న ఉదయం 10నుంచి 12 గంటల వరకు కార్వేటినగరం మండలంలో అధికారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్వేటినగరం పంచాయతీ బృందంతో, ఆశా వర్కర్లు, గ్రీన్‌ అంబాసిడర్లు, టీచర్లతో సమావేశం అవుతారు. సమీప ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని పరిశీలిస్తారు.

27న ఉదయం 8నుంచి 2 గంటల నుంచి తిరుపతి రూరల్‌ మండలంలోని తుమ్మలగుంట పంచాయతీకి చెందిన వలంటీర్లు, గ్రీన్‌ అంబాసిడర్లు, ఉపాధ్యాయులతో సమావేశం అవుతారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్తూరుకు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. జడ్పీ సీఈవో, డీపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, డీఈవో, ఐసీడీఎస్‌ అధికారులతో బృందం సమావేశమై సమీక్ష నిర్వహిస్తారు.