సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 జులై 2024 (22:55 IST)

పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి (video)

Balaraju
పోలవరం ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకుడు చిర్రి బాలరాజు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసారు.
 
నియోజకవర్గంలో పనుల నిమిత్తం వెళ్లిన క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై ఇనుప రాడ్లతో దాడి చేసారని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆ కారులో తను లేననీ, అందువల్ల నియోజవర్గ ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కావద్దని అన్నారు. కారుపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు గాలించి పట్టుకోవాలని అన్నారు.