బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (06:57 IST)

25 వరకూ జాతీయ మత సామరస్య వారోత్సవాలు: నీలం సాహ్ని

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధీనంలోని జాతీయ ఫౌండేషన్ ఫర్ క్యమ్యునల్ హార్మోని సంస్థ ప్రజల్లో జాతీయ సమైక్యత,మత సామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈనెల 19నుండి 25 తేది వరకూ జాతీయ మత సామరస్య వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆఫౌండేషన్ కార్యదర్శి మనోజ్ పంత్ తెలియజేశారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 1992 నుండి ఈసంస్థ ప్రజల్లో మత సామరస్యాన్ని,జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ప్రతి యేటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా జాతీయ మత సామరస్య ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.

ఈవారోత్సవాల్లో భాగంగా ప్రజల్లో జాతీయ సమైక్యత మత సామరస్యాలను పెంపొందించడం,అహింసా వాదంపై అవగాహన పెంపొందించే చర్యల్లో భాగంగా రాష్ట్ర,జిల్లా,గ్రామ స్థాయిల వరకూ పలు సాంస్కృతిక కార్య క్రమాలను,సెమినార్లను,చర్చా గోష్టులను,చిత్రలేఖనం,వ్యాస రచన పోటీలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని సిఎస్ పేర్కొన్నారు.

ప్రస్తుత కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకూ ఈనెల 19నుండి 25 తేది వరకు జాతీయ మత సామరస్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధింత శాఖల అధికారులకు,జిల్లా కలక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా విద్యార్ధినీ విద్యార్ధుల్లో మత సామరస్యం,జాతీయ సమైక్యత,అహింసా వాదంపై పూర్తి అవగాహన పెంపొందించేందుకు పాఠశాల,కళాశాల,విశ్వవిద్యాలయాల స్థాయిలో సెమినార్లు, చర్చా గోష్టులు,పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడంతోపాటు వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను,జిల్లా కలక్టర్లను  సిఎస్ నీలం సాహ్నిఆదేశించారు.

25న ఫ్లాగ్ డే-ధాతలు,సంస్థలు విరాళాలివ్వండి-నూరు శాతం ఆదాయపన్నుమినహాయింపు 
జాతీయ మత సామరస్య వారోత్సవాలలో భాగంగా ఈనెల 25న ఫ్లాగ్ డే(పతాక దినోత్సవం)నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.

దేశంలో జాతీయ సమైక్యతను,మత సామరస్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు మరింత తోడ్పాటును అందించే కృషిలో భాగంగా సమాజంలోని ధాతలు,సంస్థలు పెద్దఎత్తున విరాళాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ణప్తి చేశారు.

ఫ్లాగ్ డే సందర్భంగా 25న ఎన్ సిసి,ఎన్ఎస్ఎస్,స్కౌట్స్ అండ్ గైడ్స్,విద్యార్ధినీ విద్యార్ధులు,వాలంటీర్లు 100రూ.లు, 200రూ.లు,300రూ.లు,500 రూ.లు,1000 రూ.లు స్టిక్కర్లతో విరాళాలు సేకరణ చేసే విధంగా సరిపడినన్ని స్టికర్లను పంపిణీ చేయనున్నట్టు ఆసంస్థ కార్యదర్శి మనోజ్ పంత్ తెలియజేశారని సరిపడినన్ని స్టిక్కర్లను జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుందని కలక్టర్లకు  సిఎస్ తెలియజేశారు.

రాష్ట్ర్ర స్థాయిలోని ప్రముఖులు రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి,రాష్ట్ర ముఖ్యమంత్రి,రాష్ట్ర మంత్రివర్యులు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి వారి నుండి జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్,జిల్లా ఎస్ పి వంటి అధికారులకు జాతీయ జెండాను అతికించడం ద్వారా వారి నుండి తొలుత విరాళాలు సేకరణ చేపట్టి ఆతర్వాత సమాజంలోని మిగతా ధాతలు,సంస్థల నుండి స్వచ్ఛంధ విరాళాల సేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.

ఫ్లాగ్ డే(పతాక దినోత్సవం) సందర్భంగా సమాజంలోని ధాతలు,సంస్థలు విరివిగా విరాళాలు ఇవ్వాలని  ఈవిధంగా ఇచ్చే విరాళాలకు 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80జి కింద నూరు శాతం పన్ను మినహాయింపు ఉంటుందని,నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యునల్ హార్మోని సంస్థ (NFCH)Permanent Account Number(PAN)AAATN0562A గా ఆసంస్థ తెలియజేసిందని సిఎస్ పేర్కొన్నారు.

కావున ఈనెల 19నుండి 25 తేది వరకు జాతీయ మత సామరస్య వారోత్సవాలు,25న ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో అధికారులు,ఉద్యోగులు,ప్రజలను విరివిగా భాగస్వామ్యం చేసి విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులు,జిల్లా కలక్టర్లను ఆదేశించారు.