శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:28 IST)

టీడీపీలో వల్లభనేని వంశీ కలకలం.. సుజనా కారెక్కి వెళ్ళిపోయారు

తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ కలకలం సృష్టించారు. ఆయన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కారులో ఎక్కి వెళ్లడమే ఇందుకు కారణంగా ఉంది. 
 
శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న వంశీ.. తొలుత సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల మంత్రి కొడాలి నానితో రహస్య మంతనాలు జరిపారు. 
 
ఈ నేపథ్యంలో వంశీ వైసీపీలోకి వస్తారా? లేక బీజేపీలోకి వెళ్తారా? లేక తెలుగుదేశం పార్టీలో చేరుతారా? అనే అంశంపై టీడీపీ కార్యకర్తల్లో విస్తృత చర్చ సాగుతోంది. దీనిపై మరికొన్ని గంటల్లో ఓ క్లారిటీ రానుంది.