ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (08:55 IST)

విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్లదాడి

Bharat Express
ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - విశాఖపట్టణంల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పచ్చజెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రైలు ట్రయల్ రన్ కోసం బుధవారం విశాఖపట్టణంకు తరలించారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం వైజాగ్‌కు వంందే భారత్ రైలు వచ్చింది. అయితే, ఈ రైలుపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడి చేశారు. 
 
ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన ఈ రైలు మర్రిపాలెం యార్డుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్లదాడేనని వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు నిర్ధారించారు. మరోవైపు, ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు. రైల్వే ఆస్తులు కూడా ప్రజా ఆస్తులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.