ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (08:30 IST)

రేవ్ పార్టీలో దొరికిన హీరోయిన్ తరహాలో పారిపోయిన విడదల రజినీ!! (Video)

vidadala rajini
గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైకాపాకు ఇపుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయాయి. మరికొందరు తట్టాబుట్టా సర్దుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన మాజీ మంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ నుంచి నిష్క్రమించేందుకు సమాయత్తమయ్యారు. ఇందులోభాగంగా, ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 20 మంది వైకాపా కార్పొరేటర్లతో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్ తన దూతగా ఏపీ మాజీ ఆరోగ్య మంత్రి విడదల రజినీ.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పంపించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అక్కడకు మీడియా చేరుకుంది. దీంతో ఆమె మీడియా కంటపడకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రేవ్ పార్టీలో దొరికిపోయిన హీరోయిన్ల తరహాలో మాజీ మంత్రి రజినీ పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడటం ఖాయమని తెలుస్తుంది.