ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (07:51 IST)

చిలకలూరిపేట రెస్టారెంట్లలో విజిలెన్స్‌ తనిఖీలు... ఎందుకో తెలుసా?

చిలకలూరిపేట పట్టణంలోని రెస్టారెంట్లలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ప్రాంతీయ నిఘా, అమలుశాఖ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు పి.జాషువా నేతృత్వంలో తనిఖీలు చేసి పలు అవకతవకలు గుర్తించారు.

నేషనల్‌ పిఎస్‌5 రెస్టారెంట్‌లో తందూరి చికెన్‌, మటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన మాంసాహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు గుర్తించారు. గడువు తీరిన తాయిల్‌ సిరప్‌ బాటిళ్లు, మామిడి రసం సీసాలు మొదలైనవి కూడా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి చికెన్‌ బిర్యానీ, దాల్స్‌ నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. శ్రీ సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్‌లోనూ చికెన్‌ బిర్యానీ శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు.

తనిఖీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు శ్రీనివాసర్‌ బాషా, స్థానిక ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.