శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , గురువారం, 2 డిశెంబరు 2021 (19:10 IST)

విజ‌య‌వాడ‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు...ఉపేక్షించం!

విజ‌య‌వాడ నగరంలో అనధికార అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, నగరపాలక సంస్థ నుండి ఎటువంటి ప్లాన్ అనుమతి లేని నిర్మాణాలను కూల్చేస్తామ‌ని అధికారులు తెలిపారు. న‌గ‌ర క‌మిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలకు అనుగుణంగా కూల్చి వేస్తామ‌ని నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ జి.ఎస్.వి.ప్రసాద్  హెచ్చరించారు. 
 
అజిత్ సింగ్ నగర్ నందమూరి నగర్ డోర్ నెంబర్ 43-106/1-15 లో నగరపాలక సంస్థ నుండి ఏవిధమైన అనుమతి లేకుండా జరుగుతున్న కట్టడాల‌ను పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మూలన సిబ్బంది ద్వారా తొలగించారు. భవన యజమాని పట్టణ ప్రణాళిక నుంచి అనుమతి పొందకుండా మూడోవ అంతస్తు నందు నిర్మించిన పిల్లర్స్, ఏర్పాటు చేస్తున్న సెంట్రింగ్ ల‌ను బిల్డింగ్ ఇన్స్ పెక్టర్. ప్లానింగ్ సెక్రటరీ పర్యవేక్షణలో అక్రమ నిర్మూలన సిబ్బంది ద్వారా అనధికార నిర్మాణాల‌ను తొలగించారు.