ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (09:37 IST)

విశాఖలో బాలికపై అత్యాచారం.. మాయమాటలు చెప్పి.. పార్కుకు తీసుకెళ్లి?

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిన్నటికి నిన్న రాజస్థాన్ చురు ఘటన కలకలం రేపితే.. తాజాగా విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో వి. మణికంఠ (19)పై

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిన్నటికి నిన్న రాజస్థాన్ చురు ఘటన కలకలం రేపితే..  తాజాగా విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో వి. మణికంఠ (19)పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. 
 
ఆరిలోవ అయిదో సెక్టారు కనకమహాలక్ష్మి నగర్‌కు చెందిన వి.మణికంఠ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో సమీప గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక (14)కు మాయమాటలు చెప్పి, ముడసర్లోవ పార్కుకు తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
రాత్రి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా, ముడసర్లోవ ప్రధాన రహదారిపై ఆమె ఏడుస్తూ కనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువకుడిపై కేసు నమోదు చేశారు.