శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (16:39 IST)

సీఎం నుంచి ఎమ్మెల్సీ బీఫాం అందుకున్న విశాఖ వంశీకృష్ణ‌

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విశాఖ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వంశీకృష్ణ బి ఫామ్ తీసుకున్నారు. విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు సీఎం క్యాంప్ కార్యాలయంలో జ‌గ‌న్ ను క‌లిశారు. ఆయ‌న‌కు శాలువా వేసి, బొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు.  విశాఖ నుంచి త‌న‌కు అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ణ్న‌త‌లు అని ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వంశీకృష్ణ తెలిపారు. 

 
అనంత‌రం ఆయ‌న క్యాంప్ కార్యాల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించి చట్ట సభలలో స్థానం కల్పించినందుకు సీఎం, పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డికి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అది నుంచి జగన్నన్నతో  కలసి నడిచిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా ఆయ‌న కాసేపు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి  అవంతి శ్రీనివాస్, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే అమర్నాధ్ పాల్గొన్నారు.