1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (11:55 IST)

కాల్ మీ ఎనీ టైం అనే యాడ్ మోసపోయాడు.. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాక..?

కాల్ మీ ఎనీ టైం అనే యాడ్ చూసి విశాఖకు చెందిన ప్రణీత్ అనే యువకుడు మోసపోయాడు. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన అనంతరం యువకుడితో మాట్లాడిన వీడియోను ఫేస్ బుక్, యూట్యూబ్‌లో పెడతామని నింధితులు హెచ్చరించారు. అనతరం కేటుగాళ్లు యువకుడి వద్ద రూ.24లక్షలు వసూలు చేశారు.

దాంతో యువకుడు మోసపోయానని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం నింధితులు హైదరాబాద్ నుండి ఫోన్ చేసినట్టు గుర్తించారు.
 
హైదరాబాద్ నుండి ఈ గ్యాంగ్ ఘరానా మోసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో జ్యోతి అనే మహిళ యువకుడికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. నింధితులను అదుపులోకి తీసుకున్న అనంతరం వారి వద్ద నుండి 3.5 లక్షలతో పాటు 5 స్మార్ట్ ఫోన్స్,3 నార్మల్ మొబైల్స్, 3 ఏటీఎం కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ క్రైమ్ సురేష్ బాబు తెలిపారు.