సినిమా షూటింగులో అగ్నిప్రమాదం.. జనరేటర్ కారు దగ్ధం
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ సందడి మళ్ళీ మొదలైంది. అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
గురువారం ఉదయం ఫిలింనగర్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగులో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న ఒక జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ఈ క్రమంలో అందులో డిజిల్ లీక్‌కావడంతో రోడ్డు పక్కన ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అగ్నిప్రమాదంతో షూటింగ్ నిలిచిపోయింది.
అయితే ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.