గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

మందుబాబులకు విచిత్రమైన శిక్షలు విధించిన వైజాగ్ పోలీసులు

drunk and drive
విశాఖపట్టణంలో కొందరు మందుబాబులకు స్థానిక పోలీసులు విచిత్రమైన శిక్షలు విధించారు. మద్యంసేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన మద్యంబాబులను కోర్టులో హాజరుపరిచారు. వీరందరికీ ఒక్క రోజు పాటు వైజాగ్ ఆర్కే బీచ్‌లో బీచ్‌లో ఉండే చెత్తను తొలగించాలంటూ న్యాయమూర్తి శిక్ష విధించారు. దీంతో మందుబాబులందరినీ బీచ్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. వారితో బీచ్‌ను శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
గత వారాంతంలో విశాఖ పోలీసులు విస్తృతంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మందుబాబులు భారీ సంఖ్యలో పట్టుపడ్డారు. ఇలా పట్టుబడినవారిలో 52 మందిని విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వారికి ఆసక్తికరమైన శిక్ష విధించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో చెత్తను ఏరివేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్‌ను శుభ్రం చేయాలంటూ ఆదేశించారు. దాంతో పోలీసులు వారిని బీచ్‌కు తీసుకెళ్లి న్యాయమూర్తి విధించిన శిక్షను అమలు చేశారు.