శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (21:43 IST)

నడకను దినచర్యగా అలవరచుకోవాలి: కలెక్టర్ ఇంతియాజ్

విజయవాడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో, ఆరోగ్యంపై అవగాహన కోసం విజయవాడ రన్నర్స్ శ్రీరామ్ సిటీ ఆధ్వర్యంలో విజయవాడ మారథాన్ వర్చ్యువల్' రన్ జరిగింది. రన్ ను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో విజయవాడ రన్నర్ ఆధ్వర్యంలో వర్చువల్ రన్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆరోగ్యకరమైన నగరాన్ని తీర్చిదిద్దేందుకు "మారథాన్” పరుగు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతిరోజు వేకువజామున నడక, పరుగు వంటి వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అన్నారు.

బాల్యం నుంచే పిల్లలను ప్రతిరోజు ఎదో ఒక వ్యాయామంలో భాగస్వాయ్యం చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొంటారన్నారు. పరుగులో నగర వాసులతో పాటు ఇతర రాష్ట్రలు, దేశాల నుండి వర్చువల్ రన్లోలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ఆరోగ్యం పట్ల వారికి ఉన్న శ్రద్ధను సూచిస్తుందన్నారు.
 
విజయవాడ రన్నర్స్ వ్యవస్థాపకులు మణిదీపక్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి విజయవాడలో రన్ నిర్వహిస్తున్నామని ఇది 5వసారి అన్నారు. కోవిడ్ సందర్భంగా నిర్వహించిన మనరాష్ట్రంతో పాటు ఇతర
రాష్ట్రాలు, దేశాల వారు కూడ వర్చువల్ మారథాన్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

ప్రతిరోజు రన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, బాడిలో రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందని, విటమిన్ డి పెగురి మంచి ఆరోగ్య వంతులుగా ఉండటారని అన్నారు. వివిధ రాష్ట్రాలు మరియు వివిధ దేశాల నుంచి ఎంతో మంది తమ తమ ప్రాంతాల నుంచే ఈ వర్చ్యుయల్ రన్ లో పాల్గొని ఏదో ఒక మొబైల్ ఆప్ ద్వారా తమ రన్ వివరాలు నిర్వాహకులకు పంపి కొరియర్ ద్వారా మెడల్ పొందవచ్చు.

ఇటువంటి పూర్తి వర్టువల్ రన్ నిర్వహించటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే మొదటిదిగా చెప్పుకోవచ్చు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ ను మెయిల్ కు, మెడల్ కొరియర్ ద్వారా పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో  శ్రీరామ్ సిటీ సభ్యులు, విజయవాడ రన్నర్స్ నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.