గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (12:06 IST)

అంత్యక్రియలకు వచ్చి.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు..

స్మార్ట్‌ఫోన్ల పుణ్యంతో నేరాలు పెరిగిపోతున్నాయి. తాగిన మైకంలో ఓ యువకుడు ఓ మహిళ స్నానం చేస్తుండగా.. ఫోన్‌లో వీడియో తీశాడు. కానీ స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో తన బంధువు అంత్యక్రియలకు కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. 
 
ఫూటుగా మద్యం తాగి.. ఓ వైపు అంతిమయాత్ర జరుగుతుండగానే, తాగిన మైకంలో ఉన్న అతడు ఓ ఇంటి వద్ద మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయబోయాడు. దీన్ని గమనించిన స్థానికులు, మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.