శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (08:00 IST)

ఉడత ఊపులకు భయపడం..దేవినేని

నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో  దేవినేని ఉమామహేశ్వరరావు తంగిరాల సౌమ్యతో కలిసి పాల్గొన్నారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు.

అనంతరం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆర్థికంగా దెబ్బ తీస్తూ భౌతిక దాడులకు దిగుతున్నారని తప్పుడు కేసులు పెడుతూ తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని దేవినేనికి తెలిపారు.

ఈ సందర్భంగా దేవినేని హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేసిన నాయకులు సర్. ఆర్థర్. కాటన్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆపద్బాంధవుడిలా దేవినేని నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ వైసీపీ ఉడత ఊపులకు భయపడే లక్షణం తెలుగుదేశం పార్టీని కాదని, అభివృద్ధి  ప్రజాసంక్షేమాలే లక్ష్యంగా  తెలుగుదేశం పార్టీ పనిచేసిందని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని మరిచి అరాచకాలు అక్రమాలకు దిగుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని అది వారి తరం కాదని అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని తెలుగుదేశం పార్టీ నందిగామలో స్వర్గీయ దేవినేని రమణ తంగిరాల ప్రభాకరరావుల స్ఫూర్తితో ముందుకు సాగుతుందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టెర్రరిస్టుల కంటే దారుణంగా అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. సంవత్సరానికి రూ.12,500/- రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చాక 6500/- మాత్రమే ఇస్తామని అది మూడు విడతలుగా ఇస్తామని చెప్పడం వైసిపి దిగజారుడు విధానాలకు నిదర్శనమని అన్నారు.

లక్షన్నర రైతు రుణమాఫీ 5విడతలుగా చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినప్పుడు విమర్శించిన వైసిపి నాయకులు నేడు రూ.6,500/- కూడా3 విడతలుగా ఇవ్వడం ఏ విధంగా సమాధానం చెబుతారని దేవినేని ప్రశ్నించారు.

ప్రజా సంక్షేమాన్ని మరిచి ఇసుక కొరత సృష్టించి ఇసుక దోపిడీ చేస్తున్న వైసీపి  చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున తంగిరాల సౌమ్య,  రాం రాజగోపాల్ తాతయ్యలు నిరసన దీక్ష చేయనున్నారని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సుబాబుల్ డబ్బులు గురించి మాట్లాడామని ఇచ్చేస్తున్నామని సన్మానాలు చేయించుకున్న వారు ఇంతవరకు డబ్బులు పడకపోవడానికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని తాటాకు చప్పుళ్లకు  భయపడుతూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని దేవినేని అన్నారు.

సమావేశం అనంతరం వైసిపి అక్రమంగా అరెస్టు చేసిన మొగులూరు కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వెలగా నరశింహరావు మరియు కార్యకర్తలను దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్యలు నందిగామ సబ్ జైలు లో కలిసి వారికి తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

అనంతరం ఇటీవల మృతి చెందిన కేడీసీసీ బ్యాంకు సీనియర్ మేనేజర్ శాఖమూరి విజయ పార్థసారథి కుటుంబసభ్యులను పరామర్శించారు. రైతుపేటలో గుండెపోటుతో మృతిచెందిన వేమూరి కిషోర్ బాబు కుటుంబ సభ్యులను  దేవినేని పరామర్శించారు.