రోడ్లు వేస్తామని 15 నెలలుగా ఎదురుచూస్తున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
నున్నటి తారు రోడ్లు వేస్తామని గత 15 నెలలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... ప్రజలు మనకు మార్పు తీసుకువస్తామని ఓట్లు వేసామని అన్నారు. రోడ్లు వేస్తామని నమ్మకంతో చూస్తున్నారని అన్నారు.
గత 15 నెలలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంబంధిత మంత్రిగారు రోడ్లు వేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు కోరుకున్నట్లు మనం చేయకపోతే గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలు మనపై నమ్మకం కోల్పోతారంటూ ఆందోళన వ్యక్తం చేసారు.