గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:13 IST)

జగన్ ప్రభుత్వం ఆ సొమ్మంతా ఏం చేస్తోంది?: బొండా ఉమామహేశ్వరరావు

వైసీపీ అధికారంలోకి వచ్చాక, జగన్ 20నెలల పాలనలో సామాన్యులు, పేదమధ్యతరగతి ప్రజల జీవితాలు తలకిందులయ్యా యని, అసంఘటిత, భవననిర్మాణ రంగ కార్మికులుసహా, చేతి,కుల వృత్తులవారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయని టీడీపీ నేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

టీడీపీప్రభుత్వంలో విద్యుత్, గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు సహా, నిత్యావసరాల ధరలు ప్రజలకు అందు బాటులో ఉండేవని, ఈ ప్రభుత్వం వచ్చాక వాటిపై ధరలుపెంచడం తో ప్రజలు అందుకు మూల్యంచెల్లించుకుంటున్నారన్నారు.  
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ స్టాటిస్టిక్స్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారమే తాము ప్రజలపై పడినధరలభారంగురించి మాట్లాడు తున్నామని బొండా స్పష్టంచేశారు.

వైసీపీప్రభుత్వంలో బియ్యం పై రూ.10, కందిపప్పుపై రూ.25, పెసరపప్పు, మినపప్పు, సహా ఇతర నిత్యావసరాలుతోపాటు, గ్యాస్, విద్యుత్, పెట్రోల్-డీజిల్, ఆర్టీసీ ఛార్జీలును దారుణంగాపెంచడం జరిగిందన్నారు. 
వైసీపీప్రభుత్వ వచ్చాకే ధరలు ఎందుకిలా పెరిగాయనే ఆలోచన ప్రజలు చేస్తున్నారని, జగన్ ప్రభుత్వ అసమర్థపాలనే ఇందుకు కారణమని వారుభావిస్తున్నారన్నారు.

జగన్ ను నమ్మి, ఓటేసిన ప్రతిఒక్కరూ, తమచెప్పులతో తామే కొట్టుకుంటన్నారని ఉమా ఎద్దే వాచేశారు. 20నెలలపాలనలో రూ.లక్షా40వేలకోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం, ఆసొమ్ముతోపాటు మద్యం, ఇసుకధరలు పెంచడంతో పాటు, ల్యాండ్, మైనింగ్ మాఫియాల ద్వారా వస్తున్న సొమ్ముని ఏంచేస్తోందని టీడీపీనేత నిలదీశారు.

జగన్ అధికారంలో కి వచ్చాక రాష్ట్రంలోని ఒక్కోసామాన్య కుటుంబంపై రూ.2లక్షల వరకు భారంపడిందని ప్రభుత్వనివేదికలే (డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ స్టాటిస్టిక్స్) చెబుతున్నాయన్నారు.  పనుల్లేక, ఎక్కడా ఉపాధిలేక అల్లాడిపోతున్న ప్రజలు ఇంకా ఈఅవినీతి ముఖ్యమంత్రి పాలనలో ఎన్నాళ్లు బతకాలిరా దేవుడా అని వాపోతున్నారని ఉమా పేర్కొన్నారు.

గతంలో రూ.50లు అమ్మే క్వార్టర్ మద్యాన్ని ఇప్పుడు రూ.250చేశారని, ఉచితంగా లభించే ఇసుకను లారీ రూ. 50వేలకు అమ్ముకుంటున్నారని, పేదలకుఇచ్చేఇంటిస్థలాల ముసుగులో వేలాదికోట్లను అడ్డగోలుగా దోచేయడంద్వారా జగన్ ప్రభుత్వం లెక్కలేనంత దోపిడికీ పాల్పడిందన్నారు.

ఆ విధమైన దోపిడీ అలా ఉంటే, ఇప్పటివరకు తీసుకొచ్చిన రూ.లక్షా40వేలకోట్ల అప్పులు, నిత్యావసరాలుసహా, వివిధరకాలుగా పెంచిన ఛార్జీల భారం, ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్తపన్నులద్వారా వచ్చేసొమ్మం తా ఎక్కడికిపోతోందో ప్ర్రబుత్వం సమాధానం చెప్పాలని టీడీపీనేత నిలదీశారు.

ప్రజలనుంచి వచ్చేఆదాయంతోపాటు, ల్యాండ్, మైనింగ్, శాండ్, లిక్కర్ మాఫియాలతో వచ్చే  సొమ్ములో మంత్రులు, ముఖ్యమంత్రి వాటా ఎంతుందో చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. అప్పులరూపంలో తెచ్చిన రూ.లక్షా40వేలకోట్లు, అవినీతిద్వారాసంపాదించిన రూ.లక్షకోట్లు ఏమయ్యాయో, ఒక్కో కుటుంబంపై రూ.2లక్షలవరకుభారం ఎందుకు మోపారో వైసీపీ ప్రభుత్వ పాలకులు సమాధానంచెప్పాలన్నారు.

జగన్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే నేడు రాష్ట్రంలోని ఒక్కో పేదకుటుంబంపై రూ.2లక్షల వరకు భారం పడిందన్నారు. ప్రభుత్వ ఇచ్చినధరల పట్టికప్రకారం, పెరిగిన ధరలప్రభావం ద్వారా సామాన్యుడిపై పడుతున్న భారానికి ఎవరు బాధ్యతవహిస్తారన్నారు.

గుత్తాధిప త్యంగా ఇసుకను పక్కదారి పట్టించి సొమ్ముచేసుకుంటున్న ప్రభుత్వం, మద్యం అమ్మకాలతో మరోవిధంగా దోపిడీ చేస్తోందన్నా రు.  మద్యం అమ్మకాలద్వారా వచ్చేసొమ్ములో ఏటా రూ.5వేలకోట్ల వరకు జగన్ కు ముడుతున్నాయన్నారు. 

ధరల నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటుచేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందో ముఖ్య మంత్రి సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ఆ దిశగాచర్యలు తీసుకుంటే, ధరలు ఎందుకుపెరుగుతున్నాయన్నారు.

అప్పుల ద్వారా,అవినీతిద్వారా, వివిధపన్నులరూపంలో ప్రజలనుంచి వసూలుచేసిన సొమ్ము అంతా ఏమవుతోందని, ఎవరికి ఖర్చుచేశా రని టీడీపీనేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.