మద్యం సరఫరాకు టెండర్ వేసిన ఒకే ఒక్క బిడ్డర్ ఎవరు?: దేవినేని ఉమ

devineni
ఎం| Last Updated: బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. అనామక బ్రాండ్లు, నాసి రకం మద్యంతో పాటు రవాణాలోను జరుగుతున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పండి అని నిలదీశారు.

డిపోల నుంచి మద్యం రవాణా చేసేందుకు టెండర్లు పిలిచారని, 13 జిల్లాలకు కలిపి ఒకే టెండర్‌ ఉందని పేర్కొన్నారు. అది కూడా ఒక్కరు మాత్రమే టెండర్‌ వేశారని, అంతేగాక ప్రస్తుతమవుతున్న ఖర్చు కంటే దాదాపు 60 శాతం ఎక్కువ ధర కోట్‌ చేసినట్లు సమాచారం అందిందని అందులో ఆరోపించారు.

సింగిల్‌ బిడ్‌ రావడంతో ఇప్పుడు ఈ టెండర్‌ నోటిఫికేషన్‌ను కూడా కనిపించకుండా చేశారని తెలిసిందని అందులో చెప్పారు.దీనిపై మరింత చదవండి :