గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (18:43 IST)

ఏపీకి కేంద్రం నుంచి వరదలా నిధులు, కానీ ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు తీస్తుంది?

ఏపీకి కేంద్రం నుంచి వరదలా నిధులు పంపుతున్నప్పటికీ ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు తీస్తుంది? అని పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు.


ఆయన తూ.గోలో మాట్లాడుతూ... కేంద్రం నుంచి ఆశించిన దానికన్నా మూడురెట్లు ఎక్కువగా నిధులు వస్తున్నప్పటికీ ఏపీ ఆర్థికంగా దివాళా ఎందుకు తీస్తుందో తనకు అర్థం కావడంలేదన్నారు. కమీషన్లు దండుకోవడంతో ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోతున్నారంటూ విమర్శించారు.

 
మరోవైపు సోము వీర్రాజు వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదలకు మంజూరు చేస్తున్న ఇళ్లను సకాలంలో నిర్మించడంలో వైసిపి ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం విశాఖ రైల్వే జోన్ త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.