శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 4 నవంబరు 2017 (21:04 IST)

జగన్ స్వరూపానందను ఎందుకు కలిశాడో తెలిస్తే షాక్...

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ కాస్త వెనక్కి తగ్గి రకరకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అది కూడా ఎక్కడ తగ్గాలో తెలుసన్న సామెతలా వ్యవహరిస్తున్నారు. మొదటగా జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు దగ్గరయ్యే ప్రయత్నం చేస

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ కాస్త వెనక్కి తగ్గి రకరకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అది కూడా ఎక్కడ తగ్గాలో తెలుసన్న సామెతలా వ్యవహరిస్తున్నారు. మొదటగా జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
 
తిరుమలలో ఉన్న స్వరూపానందస్వామిను నేరుగా కలిసిన జగన్ తన పాదయాత్ర విజయవంతమయ్యే విధంగా ఆశీర్వదించాలని కోరారు. జగన్ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఎవరి సలహాలు కాని, ఎవరి ఆశీర్వాదం కానీ తీసుకోరని గతంలో ఓ విమర్శ వుండేది. అలాంటిది స్వరూపానందస్వామిని కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.