శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (09:03 IST)

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ ను జగన్ ఢీకొడతారా?

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తన వైఖరిని స్పష్టంగా తెలియజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో..రాష్ట్రం తరఫున సీఎం జగన్‌, జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌..అధికారులతో కలిసి దిల్లీలోని ఏపీ భవన్ నుంచి హాజరు కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..హైదరాబాద్‌ నుంచే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ సమావేశంలో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిసస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.