బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (19:27 IST)

కన్నకూతురిని వ్యభిచార రొంపిలోకి దించాలనుకుంది.. అయితే జరిగిందేంటంటే?

woman
అల్వాల్‌లో ఓ ఘటన కలకలం రేపింది. ఒక తల్లి తన సొంత కుమార్తెను వ్యభిచారంలోకి దింపిందని ఆరోపణలు వచ్చాయి. అయితే కన్నతల్లి వేధింపులు భరించలేక యువతి ఇంటి నుంచి పారిపోయి అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు బాధితురాలిని మహిళల సహాయ కేంద్రమైన సఖి కేంద్రానికి తరలించారు. దీంతో బాలిక తల్లి, ఆమెకు మద్దతుగా నిలిచిన మరో మహిళతో కలిసి అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసింది.
 
అయితే పోలీసులు యువతిని వ్యభిచార రొంపిలోకి దించేందుకు ప్రయత్నించిన ఇద్దరి మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.