మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 25 జూన్ 2018 (21:00 IST)

పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు...

పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు... చెప్పుతో కొడతా... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... ఇవి గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఓ మహిళ అందుకున్న తిట్ల దండకం. తనకు టికెట్టు ఇవ్వలేదన్న కోపంతో రైల్వే అధికారిపై నోటికి వచ్చిన తిట

పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు... చెప్పుతో కొడతా... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... ఇవి గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఓ మహిళ అందుకున్న తిట్ల దండకం. తనకు టికెట్టు ఇవ్వలేదన్న కోపంతో రైల్వే అధికారిపై నోటికి వచ్చిన తిట్లు అన్నీ తిట్టేసింది. అంతటితో ఆగకుండా రైల్వే పోలీసులపై కూడా ఒంటికాలిపై లేచింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ టికెట్టు తీసుకోవడానికి గుంటూరు రైల్వే స్టేషన్‌ కౌంటర్‌లో నిలబడింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమెకు వెళ్లాల్సిన ట్రైన్ కాస్తా వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన మహిళ సదరు ఉద్యోగిపై తిట్ల దండకం అందుకుంది. నోటికొచ్చినట్టు రైల్వే సిబ్బందిని బూతులు తిట్టింది. సమస్య తెలుసుకోవడానికి వచ్చిన రైల్వే పోలీసుని కూడా చెడామడా వాయించేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.