శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (15:35 IST)

చనిపోయిన భర్త ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్‌.. చీకటిగా వుందా? చివరికి?

నాలుగు నెలల క్రితం కట్టుకున్న భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. భర్త మరణం భార్యను తీవ్రగా కలచివేసింది. భర్త చనిపోయినా.. అతని ఫోనుకు వాట్సాప్ మెసేజ్‌లు చేసింది. చనిపోయిన భర్త ఫోన్‌కు చీకటిగా ఉందా? సమాయానికి భోజనం చేస్తున్నావా..? నీవులేని ప్రతీ క్షణం నరకం కనిపిస్తోంది.. మేము కూడా నీ దగ్గరికి వచ్చేస్తాం.. మమ్మల్ని రిసీవ్ చేసుకుంటావ్ కదూ అంటూ ప్రతిరోజూ మెసేజ్‌లు పెట్టింది. 
 
చివరికి ఎలా చనిపోవాలనే దానిపై అంతర్జాలంలో వెతికింది. చివరకు కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటప చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓంకార్‌ సిధ్దార్థ్, ఆర్తి(38) తన కూతురు తాసి(7) మెట్టుగూడలో నివాసముంటున్నారు. ఇటీవల ఓంకార్ మృతి చెందాడు. దీంతో కలత చెందిన ఆర్తి భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. నిత్యం భర్తను తలచుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది.  
 
చివరకు తాను, తన కూతురు ముఖాలకు కవర్లు వేసుకుని, ఆపై గ్యాస్ లీక్ చేసుకుని నిప్పంటించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి కూతురు ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ధర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్తుం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.