సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (12:44 IST)

చంద్రబాబుది తల్లి టీడీపీ-జనసేన పిల్ల టీడీపీ: రోజా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా జనసేనానికి కౌంటరిచ్చారు. చంద్రబాబుది తల్లి టీడీపీ అయితే జనస

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా జనసేనానికి కౌంటరిచ్చారు. చంద్రబాబుది తల్లి టీడీపీ అయితే జనసేన పిల్ల టీడీపీ అన్నారు. జనసేన చంద్రబాబుకు భజనసేనగా మారిపోయిందని రోజా ధ్వజమెత్తారు. అనుభవం లేని వాళ్లు సీఎం కావాలనుకోకూడదని పవన్ చేసిన వ్యాఖ్యలపై రోజా మండిపడ్డారు. 
 
అనుభవం లేని నారా లోకేశ్ ఎమ్మెల్సీ అయి.. మంత్రి కావడం సరైందేనా? అంటూ ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు లాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ తన భుజాలపై మోస్తున్నారంటూ రోజా విరుచుకుపడ్డారు. 
 
వైసీపీ పార్టీ పెట్టకముందే, జగన్ ఎంపీ అయ్యారని, వైఎస్సార్ ఉన్నప్పుడే జిల్లా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టారని.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా అదే తరహాలో రాజకీయీల్లోకి వచ్చారని రోజా ఎద్దేవా చేశారు.