శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (13:26 IST)

జగన్‌పై విషం కక్కుతున్న ప్యాకేజీ స్టార్ : విజయసాయి విమర్శలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ మండిపడ్డారు. ఈ ప్యాకేజీ స్టార్ వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే, సీఎం జగన్‌పై ప్యాకేజీ స్టార్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాల్షీట్లు అయిపోవస్తున్నా... ఆయనకు జనాల నుంచి కనీస స్పందన కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. కుటుంబ పిడికిలి అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారని గుర్తుచేశారు. మీ అన్న నాగబాబుకు మీరు ఎంపీ టికెట్ ఇవ్వలేదా? అని పవన్‌ను ప్రశ్నించారు. గురివింద గింజలా నీతులు చెప్పవద్దంటూ హితవు పలికారు.