1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (21:59 IST)

యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్.. డిస్‌లైక్‌లు ఎన్ని వచ్చినా పబ్లిక్ కావు

యూట్యూబ్ తాజాగా స‌రికొత్త ఫీచ‌ర్ తీసుకువ‌చ్చింది. ఇక నుంచి యూట్యూబ్‌లో డిస్ లైక్‌లు అనేవి క‌నిపించ‌వు. డిస్ లైక్‌లు క‌నిపించ‌కుండా యూట్యూబ్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. దాని కోసం యూట్యూబ్ కొత్త ఫీచ‌ర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల డిస్ లైక్‌లు అనేవి అంద‌రికీ క‌నిపించ‌వు. డిస్ లైక్‌లో కేవ‌లం విడీయో ని క్రియేట్ చేసిన వారికే మాత్ర‌మే ప్ర‌ైవేట్‌గా కనిపిస్తుంది.
 
అయితే యూట్యూబ్‌లో కొత్త గా వ‌చ్చే వారి క్రియేటివిటీని ప్రోత్స‌హించాల‌నే ఉద్ధేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకుంది. అందుకోసం కొత్త ఫీచ‌ర్ తీసుకువచ్చింది. అయితే గ‌తంలో చాలా వీడియోల‌కు లైక్‌ల కంటే‌.. డిస్ లైక్‍ల సంఖ్యనే ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా కొన్ని సినిమాల‌కు, టీజ‌ర్ల‌కు, పాట‌ల‌కు, షార్ట్ ఫిల్మ్‌కు డిస్ లైక్లు ఎక్కువ‌గా వ‌చ్చేవి. అయితే ఇప్పుడు యూట్యూబ్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల డిస్‌లైక్‌లు ఎన్ని వ‌చ్చినా.. అవి ప‌బ్లిక్‌గా క‌నిపించ‌వు.