బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (12:35 IST)

పవన్‌ను చంపేస్తామన్న జగన్ వీరాభిమాని అరెస్టు..

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అంటే అడ్డంగా నరికి చంపేస్తామంటూ జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ను వార్నింగ్ ఇచ్చిన జగన్ అభిమాని వెంకటరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అంటే అడ్డంగా నరికి చంపేస్తామంటూ జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ను వార్నింగ్ ఇచ్చిన జగన్ అభిమాని వెంకటరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈయన రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండటం గమనార్హం. 
 
ఇటీవల జగన్‌పై పవన్ విమర్శలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆగ్రహించిన వెంకట రెడ్డి పవన్ హెచ్చరిస్తూ తీసిన సెల్ఫీ వీడియోను అతను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఈ వీడియా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై గుంటూరు శివార్లలోని నల్లపాడు పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
 
''జగన్‌తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్‌కిస్కా గొట్టంగాడని, జగనన్నను ఏమైనా అంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని వీడియోలో వెంకటరెడ్డి హెచ్చరించాడు. 'జబర్దస్త్' హైపర్ ఆదితో జగన్ సమానమని... ప్రజలకు జగన్ దేవుడితో సమానమని, ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటారని చెప్పాడు. తనది గుంటూరని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి తనను ఎదుర్కోవాలంటూ" సవాల్ విసిరాడు. దీంతో పోలీసులు అతన్ని గురువారం అదుపులోకి తీసుకున్నారు.