గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (11:49 IST)

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సీఎం జగన్

modi - jagan
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం ప్రధానిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు విభజన హామీలు అమలు చేయాలని మరోమారు ప్రధానిని సీఎం కోరినట్టు సమాచారం. 
 
మరోవైపు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే.సింగ్‌తో సీఎం సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో సమావేశమవుతారు. అలాగే, మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో సీఎం జగన్‌ వెంట వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.