సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (07:39 IST)

నేడు ప్రధానితో భేటీకానున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

హస్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విజయవాడ గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన విషయం తెల్సిందే. ఆ రాత్రికి హస్తినలోనే బస చేసిన ఆయన... సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. 
 
ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో కూడా భేటీ అవుతారు. ఈ పర్యటనలో సీఎం జగన్ వెంట ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఉండే అవకాశం ఉంది. కానీ, ప్రధాని మోడీతో మాత్రం ఆయన ఒంటరిగా భేటీ అవుతారని సన్నిహత వర్గాల సమాచారం.