ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (11:28 IST)

జవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన సోదరి.. నెట్టింట ఫోటో వైరల్

Rakhi
Rakhi
రాఖీ పండుగ సందర్భంగా అమరవీరుడైన తన సోదరుడి విగ్రహానికి సోదరి రాఖీ కట్టిన చిత్రం నెటిజన్లను కంటతడి పెట్టించింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన గణపత్ రాం కద్వాస్ అనే యువ సైనికుడు జమ్మూకాశ్మీరులో 2017 సెప్టెంబరు 24వతేదీన వీరమరణం చెందారు. 
 
అనంతరం షహీద్ గణపత్ రాం కద్వాస్ వీరమరణం అనంతరం అతని విగ్రహాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా జోధ్‌పూర్ నగర సమీపంలో ఖుడియాలా గ్రామానికి చెందిన వీరుడి సోదరి గణపత్ రాం కద్వాస్ విగ్రహం వద్దకు శుక్రవారం వచ్చి అతని విగ్రహం చేతికి రాఖీ కట్టి అతని ఆశీస్సులు పొందారు. 
 
దేశం కోసం ప్రాణాలు కోల్పోయి వీరుడిగా మిగిలిన తన సోదరుడిని రాఖీ పండుగ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అతని విగ్రహం చేతికి రాఖీ కట్టింది. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో భారీగా లైకులు, షేర్లు వస్తున్నాయి.