సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (19:11 IST)

రాఖీ పూర్ణిమ.. భద్ర సమయంలో రాఖీ కట్టకండి..

పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ అంటారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11, గురువారం. ఈ రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రావణపండుగను జరుపుకుంటారు. పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగష్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 07:05 వరకు చెల్లుతుంది. 
 
ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి శ్రావణ పూర్ణిమ ఆగష్టు 11న వస్తుంది. ఈ ఏడాది రక్షాబంధన్ కూడా ఆగస్టు 11న జరుపుకోనున్నారు. శ్రావణ పూర్ణిమ నాడు సాయంత్రం 08:51 భద్ర సమయం ముగుస్తుంది. ఈ సమయంలో మీరు రక్షాబంధన్ పండుగను జరుపుకోకూడదు. ఆ ఘడియలు ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. 
 
రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. రక్షాబంధన్ సందర్భంగా భద్ర కాలంలో లంకేశుడికి తన సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తరువాత లంక చెడు దశ ప్రారంభమైంది. రావణుడికి దురదృష్టం మొదలైందని చెబుతారు.
 
అందుకే సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టండి. అంటే 08:51 రాత్రి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 12 ఉదయం 07: 05 వరకు కట్టండి. కొన్ని నిబంధల మినహా సాయంత్రం 06:08 నుండి 08:00 గంటల మధ్య సోదరులకు రాఖీ కట్టవచ్చని పండితులు చెబుతున్నారు.