ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (09:38 IST)

వైఎస్ఆర్ సీపీకి వైఎస్ జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు...

jagan
తమ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్ఆర్సీపీ) తమకు తెలియజేసిందని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పార్టీ పేరు సవరణ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్‌ రెడ్డిని ఎన్నుకున్నట్లు పత్రికల్లో వచ్చిందని, పార్టీ వైపు నుంచి ఎటువంటి ప్రకటన లేనందున దానిపై స్పష్టత ఇవ్వాలంటూ ఎంపీ రఘురామ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈసీఐకి లేఖ రాశారు. 
 
దీనిపై స్పందించిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆ పార్టీ ఇచ్చిన సమాచారాన్ని పేర్కొంటూ రఘురామకు లేఖను పంపించింది. అలాగే తమ పార్టీ పేరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదా వైఎస్సార్‌సీపీగా మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ వివరించిందని కూడా ఆ లేఖలో ఈసీఐ పేర్కొంది.