బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (15:57 IST)

దావోస్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్

jagan-sameer
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దోవాస్ నుంచి రాష్ట్రానికి చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. 
 
దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక మండలి సదస్సులో సీఎం ఏపీ అధికారిక బృందానికి నాయకత్వం వహించారు. ఇందులో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు వేసేలా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో పలు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 
 
రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు.