Jagan: ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ-ఎమ్మెల్యేకి తక్కువ: జగన్ ఫైర్ (video)
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్యంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం ప్రజలు కోరుకోవడం లేదని, ఇప్పుడు దానిని ఇవ్వడం ప్రభుత్వ పరిధిలో లేదని డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనపై జగన్ స్పందించారు.
"ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ… ఎమ్మెల్యేకి తక్కువ… జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు" అని జగన్ అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే హోదా కొత్తదనన్నట్లు జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లి పార్టీ పెట్టుకోవాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా జగన్ సెటైర్లు విసిరారు.
ప్రతిపక్ష హోదాపైనా జగన్ మరోసారి మాట్లాడుతూ.. గతంలో ఢిల్లీలో బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే ఉంటే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిందని జగన్ గుర్తు చేశారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష పార్టీగా హోదా లాగేస్తామంటే తానే వద్దన్నానని.. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్న సమయంలో ఎంత సమయం మాట్లాడతావో అంతసేపు మాట్లాడమని చెప్పానని జగన్ అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్పేందుకు మాత్రమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నా అంటూ జగన్ అన్నారు.