బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (20:11 IST)

ఎన్నికలు పూర్తికాగానే జగన్ జైలుకు : చంద్రబాబు జోస్యం

chandrababu
ఎన్నికలు తర్వాత వైఎస్. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్‌లను సీఐడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి ఆవరణలో జరిగిన అనుమానాస్పద కార్యకలాపాలపై బాబు స్పందించారు. 
 
వైఎస్ జగన్ పరిపాలన పేరుతో ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అందర్నీ చంపేస్తారా? అందరినీ అరెస్టు చేసి దాడులు చేస్తారా? అని ఆయన నిలదీశారు. 
 
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అది సాధ్యంకాదన్నారు. పైగా, ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ను జైలులో పెట్టడంతోపాటు ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఆయన అన్నారు.