గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (08:39 IST)

ఆ విషయంలో బాబు ఇంత దిగజారిపోయాడా.. రోజా

భారత సైనికులపై దాడి చేసి 44 మంది ముష్కరులు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటనను ఖండించారు. ఘటనపై కేంద్రం స్పందించిన తీరును కొంతమంది తప్పుబడితే మరికొందరు సమర్ధించారు. ముఖ్యంగా ఏపీ సిఎం చంద్ర బాబునాయుడు ప్రధానిపై నిప్పులు చెరిగారు. పున్వామా ఘటనకు బాధ్యత వహిస్తూ పీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
దీంతో చంద్రబాబు తీరును తప్పుబట్టారు ఎమ్మెల్యే రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు వ్యవహారం చూస్తుంటే పాకిస్థాన్‌ను సమర్ధించే విధంగా ఉందన్నారు. మేము కేసీఆర్‌తో కుమ్మక్కయ్యామని బాబు ఆరోపిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు, ఎంపిలను సంతలో పశువుల్లా బాబు కొనలేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.