గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (13:23 IST)

ఎలా నవ్వాలో చెప్తే నవ్వుతాం లోకేశ్ బాబు : రోజా సెటైర్లు

తమ కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌‌పై వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా సెటైర్లు వేశారు. పట్టపగలు అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన నారా లోకేశ్... ఎలా నవ్వాలో కూడా చెప్తే నవ్వుతాం అంటూ లోకేశ్ బాబు. మీ జన్మలో నిజాలు చెప్తే తలలు వెయ్యి ముక్కలు అవుతాయి అనే సామెతను నిజం చేస్తున్నారు అని రోజా వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ.2.9 కోట్లు, అప్పులు రూ.5.31 కోట్లుగా ఉన్నాయంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఏమనుకుంటారో అని కొంచెం కూడా సిగ్గు లేకుండా పట్టపగలు పచ్చి అబద్ధాలు ఎలా ఆడుతున్నారు అని ట్వీట్ చేశారు.